హైదరాబాద్: భోగి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(chief minister revanth reddy) తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ, కొత్త కాంతులు పంచే భోగి మంటలు... ప్రజా పాలన తెచ్చిన మంచి మార్పులతో ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని దాదాపు కోటి మంది రైతులు(Farmers), పేదలు, వ్యవసాయ కూలీ కుటుంబాల జీవితాల్లో సంక్రాంతి పండుగ ఉల్లాసాన్ని నింపాలని సీఎం ఆకాంక్షించారు. ‘‘ఈ ఏడాది సంక్రాంతి నాలుగు సంక్షేమ పథకాల అమలుకు నాంది పలికింది- రైతు భరోసా, ఎకరాకు రూ. 12,000 లబ్దిని పెంచడం, భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత కల్పించే కొత్త రేషన్ కార్డులు(New Ration Cards), ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు. పేదలు” అని సీఎం అన్నారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులందరికీ చేరాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని, తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాలతో సహా అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.