calender_icon.png 27 December, 2024 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగుల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి

19-10-2024 12:52:44 AM

  1. సిద్దిపేటలో దళిత బిడ్డకు.. గద్వాలలో వాల్మీకి బిడ్డకు పదవులు
  2. మంత్రి పొన్నం ప్రభాకర్

గద్వాల (వనపర్తి) అక్టోబర్ 18 (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల  అభివృద్ధే ధ్యేయంగా పాలమూరు బిడ్డ  సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారని రవాణా, బీసీ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. అందులో భాగంగానే జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవులను సిద్దిపేటలో దళిత బిడ్డకు, గద్వాల జిల్లాలో వాల్మీకి బిడ్డ అయిన నీలి శ్రీనివాసులుకు అవకాశం ఇచ్చారని తెలిపారు.

శుక్రవారం గ్రంథాలయ చైర్మన్‌గా నీలి శ్రీనివాసులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర య్యారు. అంతకుముందు అలంపూర్ జోగులాంబ అమ్మవారికి  ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌తో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణవేణి చౌరస్తాలో  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రంథాలయ చైర్మన్ పదవి రాజకీయ పదవి కాదని, ఉన్నత స్థానాలకు ఎదిగే మెట్ల లాంటి దేవాలయం లాంటిదని అన్నారు. పాలమూ రులో వెనుకబాటును పారదోలడానికే రేవం త్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో  ఇచ్చిన  హామీలను వరుసగా అమలు చేస్తున్నామన్నారు.

రూ.2 లక్షల రుణమాఫీ కానివారికి త్వరలోనే అవుతుందన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగాగా రాష్ట్రంలో బీసీ కుల గణనను ప్రారంభించామని తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో  మూడు రంగుల జెండా ఎగిరేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.

మాజీ జడ్పీ చైర్‌పర్సన్ సరిత మాట్లాడుతూ అభివృద్ధి ఇక ఆరంభం అయ్యిందని అన్నారు. గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దల సహకారంతో జిల్లా గ్రంథాలయ అబివృద్ధికి దోహదం చేస్తానన్నారు. అనంతరం పదిలో మంచి మార్కులు సాధించిన ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను అందించారు.