14-03-2025 10:54:02 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): అసెంబ్లీలో మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ని సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో శుక్రవారం బి ఆర్ ఎస్ నాయకులు బెల్లంపల్లి లోని మున్సిపల్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని దుర్గం చిన్నయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తారని భయంతోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ , టీబీజీకేఎస్ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.