calender_icon.png 19 March, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

19-03-2025 02:14:11 AM

కరీంనగర్ క్రైమ్, మార్చి18 (విజయక్రాంతి): ఎస్సీ ,ఎస్టీ, బీసీ,, మైనార్టీ సోదరులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పేరుతో సంక్షేమ పథకాన్ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు  ఆధ్వర్యంలో నగరంలోని కార్ఖానగడ్డలోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ , దామోదర రాజనర్సింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. 

కార్యక్రమానికి హాజరైన పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ నిన్నటి రోజు అసెంబ్లీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు.  రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇట్టి అవకాశాన్ని కల్పించిన రేవంత్ రెడ్డి గకిప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రోళ్ళ సతీష్, మంద మహేష్, బత్తుల రాజకుమార్ ,వంగల విద్యాసాగర్ ,అబ్దుల్ భారీ ,నాగుల సతీష్ ,మొసర్ల రామ్ రెడ్డి  పాల్గొన్నారు.