హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో లోక్ సభ స్వీకర్ ఓం బిర్లా కుమారై అంజలి వివాహానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అనంతరం ఏఐసీసీ నాయకత్వంతో కీలక రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించే లక్ష్యంతో ఈ పర్యటన సాగుతున్నట్లు సమాచారం. తన ఢిల్లీ పర్యటనలో, ముఖ్యమంత్రి తన మంత్రివర్గ విస్తరణ, వివిధ కార్పొరేషన్ పోస్టులకు నియామకాలను ఖరారు చేయడంపై కూడా చర్చలు జరుపుతారు.
తెలంగాణలో జరగనున్న ప్రజా సంబరాలకు హాజరుకావాలని రాహుల్ గాంధీ సహా ఏఐసీసీ సీనియర్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించనున్నట్లు సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. వీటిలో ప్రధానమైన సాంస్కృతిక కార్యక్రమం అయిన సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణలో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీని ఆయన ఆహ్వానించనున్నారు. సీఎం రేవంత్ ఇవాళ రాత్రికే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.