calender_icon.png 21 November, 2024 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదర్ మేళాను రాష్ట్ర పండుగగా ప్రకటించడం హర్షణీయం

29-10-2024 09:02:09 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం సదర్ మేళాను రాష్ట్ర పండుగగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ సంఘాల నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదర్ సమ్మేళన ఉత్సవాలను ఉమ్మడి పది జిల్లాలలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు రూ.1.50 కోట్లు మంజూరు చేసినందుకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కులాల మతాల అతీతంగా సదర్ సమ్మేళనాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. యాదవుల పట్ల ప్రభుత్వం చూపిన ప్రేమకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు సదర్ మేలును అధికారికంగా నిర్వహించలేదని పలుమార్లు యాదవ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని తెలిపారు దీపావళి నుంచి వారం రోజులపాటు జిల్లాల్లో షెడ్యూల్ వారిగా సదర్ సమ్మేళనాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నేతలు శంకర్ యాదవ్, పాండు యాదవ్, మహేందర్, శంకర్రావు, నిరంజన్ అడ్వకేట్ అనిల్, బాలరాజు పాల్గొన్నారు.