30-03-2025 02:10:26 PM
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Verma)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నకు రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ని కలిసిన వారిలో మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, లోక్‌సభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. గంటకుపైగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం.
అంతకు ముందు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ(Telangana Language and Culture Department), దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు శంకరయ్య, మల్ రెడ్డి రంగా రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.