calender_icon.png 12 March, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొఫెసర్ వై.ఎల్ శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి అభినందనలు

12-03-2025 01:33:06 PM

హైదరాబాద్: సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(Sammakka Sarakka Central Tribal University) తొలి వైస్‌ఛాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్‌ వైఎల్‌ శ్రీనివాస్‌ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అభినందనలు తెలిపారు. వీసీతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. గిరిజన విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలు పెరిగేలా సమ్మక్క-సారక్క యూనివర్సిటీ పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి వైస్ ఛాన్సలర్(Vice Chancellor) కి సూచించారు. సమ్మక్క-సారక్క యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని, రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకొని వస్తే, అన్ని అంశాలు చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.