హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్(Senior Journalist) ఆర్.స త్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా,శాసనమండలి సభ్యులుగా సత్యనారాయణ(R.Satyanarayana) చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్ సత్యనారాయణ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. తెలంగాణ ఉద్యమం(Telangana Movement)లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. మంజీరా నది పై కర్ణాటక ప్రభుత్వం చెక్ చెక్ డ్యాములు నిర్మాణం చేసి నీటితో పొడి చేస్తున్న విధానాన్ని పుస్తకాన్ని రాసి ప్రచురించారు. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.