09-04-2025 07:41:29 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ (హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతన్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ సీనియర్ నాయకుడు, విస్తృతంగా గౌరవించబడే సాహిత్యకారుడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కుమరి అనంతన్ కు ఘన నివాళులు అర్పించారు. ఆయనను మహాత్మా గాంధీ ఆదర్శాలను ఆదర్శంగా తీసుకుని, తమిళ భాష పట్ల లోతైన మక్కువను పెంపొందించిన దృఢమైన దేశభక్తుడిగా గుర్తించారు. ప్రజా సేవకు అనంతన్ చేసిన ఆదర్శప్రాయమైన కృషిని, ముఖ్యంగా నాలుగు పర్యాయాలు శాసనసభ సభ్యుడిగా, ఒక పర్యాయం పార్లమెంటు సభ్యుడిగా ఆయన చేసిన పదవీకాలాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి హృదయపూర్వక సంతాపం తెలిపారు. అనంతన్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ పూడ్చలేని నష్టాన్ని భరించే శక్తి వారి కుటుంబానికి ఉండాలని కోరుతూ ఆయన సర్వశక్తిమంతుడిని ప్రార్థించారు.