calender_icon.png 6 February, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎల్పీ సమావేశం ప్రారంభం.. ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

06-02-2025 12:59:55 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సీఎల్పీ సమావేశం(CLP Meeting) ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో గురువారం ప్రారంభమైంది. మరి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఎఐసిసి ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ(AICC in-charge of party affairs Deepadas Munshi) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Congress President Mahesh Kumar Goud), ఇతర నాయకులు పాల్గొన్నారు. సీఎల్సీ సమావేశానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరుకాలేదు. డాక్యుమెంట్లతో సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఓ మంత్రిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

సీఎల్పీ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆగ్రనేతలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్ ను కలువనున్నారు. కులగణన వివరాలను సీఎం కాంగ్రెస్ పెద్దలకు తెలియజేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లే అవకాశం ఉంది.