calender_icon.png 6 November, 2024 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో 9 నుంచి 13 ఎంపీ స్థానాల్లో గెలుస్తాం : సిఎం రేవంత్ రెడ్డి

14-05-2024 07:48:16 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 నుంచి 13 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. బిఆర్ఎస్ కు ఆరేడు స్థానాల్లో కూడా డిపాజిట్లు రావని, సికింద్రాబాద్ లో గతం కంటే మెరుగైన పోలింగ్ జరిగిందని, సికింద్రాబాద్ లో కాంగ్రెస్ కు కనీసం 20 వేలు మేజారిటీ వస్తుందని ఆయన పేర్కొన్నారు. మెదక్ లో బిజెపి మూడో స్థానంలో ఉంటుందని, బిఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా బిజెపికి పని చేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో బిజెపి వేవ్ ఏమిలేదని, కేంద్రంలో కూడా బిజెపికి దాదాపు 220 సీట్లుకి 10 అటో, ఇటో వస్తాయన్నారు. అధిష్ఠానం నన్ను జాతీయ స్థార్ క్యాంపెయినర్ గా వేసిందనన్నారు. నిన్నటితో రాజకీయ కార్యకలాపాలు ముగిశాయని, రేపటి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి కేంద్రికరించి, రైతు రుణమాఫీ, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, సన్నబియ్యం, ఇతర సమస్యలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఫార్మర్ వెల్ఫేర్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చి, దాని ద్వారా రుణం తీసుకొని రైతురుణ మాఫీ చేస్తామని తెలిపారు. ఈనెల 6వ తేదీ నాటికి రైతుబంధు పూర్తిగా రైతుల ఖాతాలో జామ చేస్తామన్నారు. రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు ఇస్తామని, ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తే.. చూస్తూ ఊరుకోనేదేలేదని, రైతుల సమస్యలపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు.  ప్రతి అంశం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిఎం రేవంత్ తేలియజేశారు.