calender_icon.png 13 March, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను ఎవరి ట్రాప్‌లో పడను.. ఢిల్లీలో సీఎం చిట్ చాట్

13-03-2025 02:25:05 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సీఎం మీడియాతో చిట్ చాట్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ రావడం కాదు.. అసెంబ్లీలో చర్చలకు రావాలిని సీఎం సవాల్ చేశారు. డీలిమిటేషన్ అనేది.. లిమిటేషన్ ఫర్ సౌత్ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు. ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. నేను ఎవరో తెలియకుండానే పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా ఎంపిక చేశారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

నేను ఎవరి ట్రాప్ లో పడను

తాను ఎవరి ట్రాపులో పడనని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకురావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy)ని ప్రశ్నిస్తున్నానని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సినవి కిషన్ రెడ్డి పట్టించుకోవట్లేదని సీఎం ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు ప్రకటించిన హామీలు అడుగుతున్నామని ఆయన తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు(Regional Ring Road), మెట్రో విస్తరణ, కేంద్ర ప్రాజెక్టులే ఇవ్వాలని అడుగుతున్నామని వివరించారు. మెట్రోకి కేంద్ర కేబినెట్ అనుమతి(Union Cabinet approval) ఇస్తే పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు.

మెట్రో విస్తరణ హైదరాబాద్ గేమ్ ఛేంజర్

మెట్రో విస్తరణ హైదరాబాద్ గేమ్ ఛేంజర్(Hyderabad Game Changer) అని ముఖ్యమంత్రి తెలిపారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క కొత్త పాలసీ కూడా తీసుకురాలేదని ఆయన ఆరోపించారు. నిరుద్యోగాన్ని 8.8 శాతం నుంనచి 6.1 శాతానికి తగ్గించామని చెప్పారు. రూ. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తెచ్చామన్నారు. పన్ను వసూళ్లలో తెలంగాణ ముందంజలో ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రానివారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చాం.. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు(Corporation Chairman Positions) ఇచ్చామని తెలిపారు. అద్దంకి దయాకర్, విజయశాంతి(Vijayashanti), శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీలు ఇచ్చామని వెల్లడించారు. ఏప్రిల్ లో 3 రోజుల పాటు 'భారత్ సమ్మిట్' నిర్వహించాలని భావిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. విదేశాంగ శాఖ నుంచి అనుమతులు కోసం జై శంకర్ ను కలుస్తున్నామన్నారు. 

గతంలో తమిళనాడుకు మెట్రో ప్రకటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) కీలక పాత్ర పోషించారని చెప్పిన రేవంత్ రెడ్డి మామునూరు ఎయిర్ పోర్టు(Mamnoor Airport)కి 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామన్నారు. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తే సరిపోతుందన్నారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డీలిమిటేషన్ అంశం(Delimitation point)పై అఖిలపక్ష సమావేశానికి భట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేశానని సీఎం రేవంత్ చెప్పారు. తమిళనాడులో సమావేశానికి ముందు తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో అఖిలపక్ష సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నామన్నారు. అందరి అభిప్రాయాల సేకరణ తర్వాతే డీఎంకే మీటింగ్(DMK meeting) పై తమ వైఖరిని వెల్లడిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.