calender_icon.png 16 January, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్

12-09-2024 05:27:07 PM

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు తీర్పు స్టడీ చేయలేదని, దానిపై తను ఇప్పుడే ఏ కామెంట్ చేయలేను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని ఎవరి కోసం ప్రత్యేక రాజ్యాంగం ఉండదని మండి పడ్డారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ సభ్యులే అత్యధికంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురే ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.  కాంగ్రెస్  వాటా నుంచి ఎంఐఎం, బీజేపీ, సీపీఐ పార్టీలకు అవకాశం కల్పించామన్నారు.

2018లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ పీఏసీ చైర్మన్ పదవిని ఎంఐఎం పార్టీకి ఇచ్చారు. 2014లో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి పేరు, ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు ప్రతిపాదిస్తే తనన్ను రిజెక్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నేతలు పార్టీ ఫిరాయించకుండా చట్టం కఠినంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకాయే ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం 65 అయితే అందులో నుంచి ఎవరూ పార్టీ మారకపోతే మాకే మేలని సీఎం సూచించారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం, మూడు నెలల్లో కూల్చేస్తాం అన్నారు. ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో, స్పీకర్ పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. దానిపై తను ఎలాంటి కామెంట్ చేయనని, పాడి కౌశిక్ రెడ్డి భాషపై ఆ పార్టీ అధినేత స్పష్టత ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్రతకడానికి వచ్చినవారి ఓట్లతోనే బీఆర్ఎస్ పార్టీ  హైదరాబాద్ లో గెలిచిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.