calender_icon.png 10 March, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎల్పీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్

10-03-2025 05:14:10 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సీఎల్పీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. చెల్లని రూపాయి కేటీఆర్ గురించి ఎందుకు అని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టులకు బడ్జెట్ లో పరిమితమైన కేటాయింపులు ఉంటాయని,  అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడుగుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో మోదీ ఇచ్చిన హామీ మేరకే తము అడుగుతున్నామని, మోట్రో తెచ్చామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే నిధులు అడుగుతున్నామని చెప్పారు. ఎన్హెచ్ భూసేకరణకు అడ్డుపడుతున్నది ఈటెల రాజేంద్ర కాదా..? అని సీఎం ప్రశ్నించారు. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వానిది అన్నపుడు కాంగ్రెస్ పార్టీతో చర్చించాలని, కేంద్రమంత్రులు హైదరాబాద్ కు వచ్చి సమీక్షలు పెడితే కిషన్ రెడ్డి ఎదుగు రాలేదని ఈ సందర్భంగా అడిగారు. కేసీఆర్ బాధపడుతాడని కిషన్ రెడ్డి రాలేదా..?, పట్టాణాభివృద్ధి మంత్రి సమీక్ష జరిపితే ఎందుకు రాలేదు..? ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాజెక్టులు తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని సర్కార్ చూస్తుందని, సామాజిక సమీకరణాలతోనే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక జరిగిందని చెప్పారు. 

39 సార్లు కాకుంటే 99 సార్లైనా ఢిల్లీ పోతాం.. తప్పేంటి..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు బీఆర్ఎస్ రాకుండా చూస్తోందని మండిపడ్డారు. సందర్భం వస్తే తాము ఢిల్లీలో ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, కేంద్ర నిధులపై కిషన్ రెడ్డితో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరం వస్తామని, అందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అధికంగా నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శించడానికి సీఎం స్థాయి సరిపోదా..? తాను కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కేసీఆర్ ను బండకేసి కొట్టి అధికారంలోకి వచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పదేళ్లలో ప్రాజెక్టులు కట్టి ఉంటే.. ఇప్పుడు ఏపీతో సమస్య వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ పరీక్షల ఫలితాలకు.. రిజర్వేషన్లకు సంబంధం ఉండదని, మందకృష్ణ మాదిగ అంటే తనకు గౌరవం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మందకృష్ణ మాదిగ బీజేపీ నేతలా మాట్లాడితే ఎలా..?, గతంలో ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వర్తించదు అని ఆయన పేర్కొన్నారు. ఏదైనా చేయ్యాలని చూస్తే న్యాయ చిక్కులు వస్తాయన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదన్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసే తిరుగుతున్నారనే నేను చెబుతున్న అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.