07-02-2025 05:23:40 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్(CM Revanth Reddy Chit Chat) నిర్వహించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ(Telangana Cabinet Expansion) లేనట్లే అని, మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్ఠానానిదే నిర్వయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తాను ఎవరి పేరు ప్రతిపాదించట్లేదని, ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తామన్నారు. వారిని అరెస్టు చేయించి జైలులో వేయాలనే ఆలోచన లేదని, సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని కులగణన చేశామని, కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తామన్నారు.
పీసీసీ కార్యవర్గ(PCC Executive Committee) కూర్పు కొలిక్కి వచ్చిదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. పీసీసీ కార్యవర్గంపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వస్తుందన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) అపాయింట్ మెంట్ తను కోరలేదని, ప్రభుత్వం, పార్టీలో కీలక నిర్ణయాలు మొత్తం అధిష్ఠానం దృష్టిలో ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటామని ఆయన హమీచ్చారు. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవని, పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా లక్ష్యమని రేవంత్ రెడ్డి సూచించారు. రాహుల్ గాంధీతో తన అనుబంధంపై తెలియనివాళ్లు ఏం మాట్లాడితే నాకేంటి..? అని సీఎం వెల్లడించారు. పని చేసుకుంటూ పోవడమే తనకు తెలుసాన్నారు. ప్రతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదని, కులగణనలో బీసీలు ఐదున్నర శాతం పెరిగారని, లెక్కలతో సహా చూశాక పాయల్ శంకర్ అసెంబ్లీలో ఒప్పుకున్నారని సీఎం వెల్లడించారు.