calender_icon.png 10 March, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతే నేతన్నలకు ఇస్తున్నాం: సీఎం రేవంత్

09-03-2025 03:20:53 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్(Nampally Exhibition Grounds) లో ఏర్పాటు చేసిన 8వ అఖిల భారత పద్మశాలి మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం కోసం నీడలేని వాళ్లకు తన ఇల్లును ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ వచ్చిన తర్వాత కొందరు ఆయనకు నిలువనీడ లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీది కీలక పాత్ర అని, ఆయన ఎన్నో త్యాగాలు చేశారని సీఎం గుర్తు చేశారు.

కొండా లక్ష్మణ్ బాపూజీది మరణిస్తే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కనీసం చూసేందుకు కూడా వెళ్లలేదని విమర్శించారు. టెక్స్ టైల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేరు పెట్టామని, అలాగే ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా ఆయన పేరు పెడతామని సీఎం హామీ ఇచ్చారు. రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తున్నామని, తానన్ను ఆశీర్శదించిన కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నామని చెప్పారు. తానన్ను గుండెల్లో పెట్టుకుంటున్న ప్రజల రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి వెల్లడించారు. నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండొద్దని భావించానని, 1.30 కోట్ల చీరలు నేసే ఆర్ఢర్లను రాష్ట్ర నేతన్నలకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

1939లో జరిగిన కులగణన ఇప్పటివరకు మళ్లీ జరగలేదని, మండల్ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. భారత్ జోడో యాత్రలో బలహీనవర్గాల కష్టాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చూశారని, కులగణన చేసి జనాభా దామాషాలో బీసీలకు న్యాయం చేయాలన్నదే ఆయన ఆశయమన్నారు. లక్షమంది ఎన్యుమరేటర్లేను నియమించి పకడ్బందీగా కులగణన నిర్వహించామని, కులగణన నచ్చనివారు సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారని, తప్పు ఎక్కడ జరిగిందో నిరూపించమంటే ఎవరూ ముందుకు రావట్లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెడకు చుట్టుకుంటుందని బీజేపీ నేతలు భయపడుతున్నారని ఆయన రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.