calender_icon.png 16 April, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గృహప్రవేశానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

05-04-2025 01:17:11 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): రాజేంద్రనగర్ లో ఓ గృహప్రవేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాజేంద్రనగర్ లోని బుద్వేల్ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి సోదరుడు ఎలిగంటి వెంకట్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పిసిసి అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డినితో సత్కరించారు.