30-04-2025 01:09:34 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం నాడు విజయవాడకు వెళ్లారు. కంకిపాడులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా(AP Minister Devineni Uma Maheshwara Rao) కుమారుడి వివాహ వేడుకకు సీఎం రేవంత్ హాజరయ్యారు. వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ సీఎంకి హెలిప్యాడ్ వద్ద పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. వివాహ వేడుకకు రేవంత్ రెడ్డి, నారా లోకేష్ కలిసి వెళ్లడం విశేషం. వివాహ వేడుకలో నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పాల్గొన్నారు.