calender_icon.png 23 September, 2024 | 8:49 AM

కాంగ్రెస్ మాట ఇస్తే.. తప్పక జరిగి తీరుతుంది: సీఎం రేవంత్ రెడ్డి

15-09-2024 04:50:55 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పార్టీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో మహేష్ కుమార్ కు కీలక బాధ్యతలు ఇచ్చింది. ఎన్నో ఇబ్బందులు తట్టుకుని సోనియాగాంధీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ రెండు పర్యాయాలు కాంగ్రెస్ కు అధికారం దక్కలేదన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా 38 నెలలపాటు ప్రజల తరపున పోరాడినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ మాట ఇస్తే.. తప్పక జరిగి తీరుతుందని నిరూపించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్టీసీలో మహిళలు ఇప్పటి వరకు 85 కోట్ల ప్రయాణాలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండోరోజు నుంచే హామీల అమలు ప్రారంభించామని సీఎం వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలు పెంచామన్నారు.