హైదరాబాద్: భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో కొనియాడారు. డిసెంబరు 26న మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు శాసనసభ సోమవారం సమావేశమైంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) ఉదయం 10 గంటలకు అసెంబ్లీని సమావేశపరిచిన వెంటనే ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ, తెలంగాణ ఏర్పాటులో దివంగత నేత పోషించిన పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మన్మోమన్ సింగ్‌ను భారతరత్నతో సత్కరించాలని కేంద్రాన్ని కోరుతూ సభ తీర్మానం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత కే. చంద్రశేఖర్‌రావు(K Chandrashekar Rao) హాజరుకాలేదు. మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో తెలంగాణ(Telangana) ఏర్పడింది. మన్మోహన్ సింగ్ (92) డిసెంబర్ 26న న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో మరణించిన విషయం తెలిసిందే.