calender_icon.png 10 March, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

10-03-2025 12:08:48 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇవాళ్టితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. సోమవారం మధ్యామ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మూడు పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతి(Vijayashanti), అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేయనుంది. సీపీఐ పార్టీ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు(Nellikanti Satyam nomination) చేయనున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.