calender_icon.png 15 November, 2024 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఆలోచించలే

11-11-2024 02:15:50 PM

గత పాలకులు వాళ్ల ఉద్యోగాల గురించి ఆలోచించారు.

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు ఆశించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు..  వాళ్ల ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారని ఆరోపించారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాట పట్టారని ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో 50 వేల ఉద్యోగ నియామ పత్రాలు అందించామని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ త్వరగా చేపట్టేలా పర్యవేక్షించానని ముఖ్యమంత్రి వెల్లడించారు. నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం తనకు సంతృప్తిని ఇస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫామ్ హౌస్ లో కొందరు మద్యం సేవించి దీపావళి చేసుకుంటున్నారు. చిచ్చుబుడ్లకు బదులు సారాబుడ్లతో కొందరు దీపావళి జరుపుకుంటున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా.. మిమ్మల్ని పట్టుకోవద్దని దబాయిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సీఎం కోరారు. 10 నెలల్లో ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకున్నారని ఒక పెద్దాయన అంటున్నారు.. తెలంగాణ ఏం కోల్పోలేదు.. పెద్దాయన ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారన్నారు.