calender_icon.png 10 January, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర అభివృద్ధిపై మాకో కల ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

10-01-2025 01:37:02 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): హైటెక్ సిటీ(Hi-Tech City)లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్(CII Green Business Center)లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం(CII National Council Meeting) శుక్రవారం నిర్వహించారు. సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఎం మొక్క నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తామకో ప్రతిష్టాత్మక కల ఉందని, అదే తెలంగాణ రైజింగ్(Telangana Rising) అన్నారు. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ(Fourth City), ఫ్యూచర్ సిటీ(Future City) రెండు అద్భుతమైన పట్టణ కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్ వంటి ప్రపంచ మెట్రోపాలిటన్ దిగ్గజాలతో పోటీ పడటం ఫ్యూచర్ సిటీ లక్ష్యం అని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ సీఎం రెడ్డి ప్రస్తావించారు. ఫ్యూచర్ సిటీని  కాలుష్య రహిత సిటీగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే 3200 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్దమౌతోందని, వరదలు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలనుకుంటున్నాట్లు వెల్లడించారు.

ఫ్యూచర్ సిటీని పర్యావరణ అనుకూల పట్టణ స్థలంగా రూపొందించి, స్థిరమైన అభివృద్ధి, అత్యాధునిక మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆధునిక పట్టణ జీవనానికి నమూనాగా ఉపయోగపడే శుభ్రమైన, గ్రీనరీ వాతావరణాన్ని సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సాధించిందన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ ను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నామని, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందని సీఎం తెలిపారు. నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తీరప్రారం లేదు.. అందుకే డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

అందుకే ప్రభుత్వంతో చేతులు కలిపి తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక వ్యాపార సౌలభ్యాన్ని అందించే పర్యావరణ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రపంచ ఉనికిని పెంపొందించడానికి, నివాసితులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ చొరవకు సంబంధించిన కాలక్రమం, పెట్టుబడి ప్రణాళికలకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.