calender_icon.png 14 October, 2024 | 8:30 PM

ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

14-10-2024 06:24:15 PM

రంగారెడ్డి: ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కొంగరకలాన్ లోని ఫాక్స్ కాన్ కార్యాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఫాక్స్ కాన్ కార్యాలయానికి వెళ్లారు. ఫాక్స్ కాన్ పురోగతిపై ప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలకు సీఎం భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని రేవంత్ రెడ్డి కోరారు.