20-03-2025 08:23:27 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే మదన్మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించడం హర్షినియమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు శివాజీ, చంద్రం, షౌకత్ అలీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.