calender_icon.png 19 April, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

09-04-2025 05:54:20 PM

అహ్మదాబాద్,(విజయక్రాంతి): అహ్మదాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రధాన మత్రి నరేంద్ర మోదీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా సమావేశమయ్యామని పేర్కొన్నారు. మహత్మగాంధీజీ ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాకుండా గాడ్సే ఆలోచన విధానాన్ని వ్యాపింపజేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని సీఎం ఎద్దేవ చేశారు.  గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకోవాలని, తెలంగాణ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల కుటుంబాలకు సూమారుగా రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేసి చూపించామన్నారు.

తాము నిజాం ప్ర‌భుత్వం కింద ఉన్న‌ప్పుడు జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ నాయ‌క‌త్వంలో వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం వ‌చ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాకు స్వాతంత్య్రం ప్ర‌సాదించిన వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌ వార‌సుల‌తో, గుజరాత్ ప్ర‌జ‌ల‌తో మా తెలంగాణ  ప్ర‌జ‌ల‌కు హృద‌య‌పూర్వ‌క‌మైన బంధం ఉందన్నారు. నిజాం ప్ర‌భుత్వం నుంచి మాకు స్వాతంత్య్రం వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఇచ్చారని,   తెలంగాణ‌ను సోనియా గాంధీ అందించిందని స్పష్టం చేశారు. వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ భూమి నుంచి నేను ఒక్క‌టే చెబుతున్నా... సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని,  వారిని ఎవ‌రూ క్ష‌మించారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేారు. గాంధీజీ బ్రిటిష్ పాల‌న‌కు వ్యతిరేకంగా దండి స‌త్యాగ్ర‌హంతో 30 ఏళ్ల పాటు అనేక పోరాటాలు చేశారు. కానీ బ్రిటిష్‌ వాళ్లు ఎప్పుడూ గాంధీజీ  మీద లాఠీ ప్రయోగం చేయలేదున్నారు.

స్వాతంత్య్రం వ‌చ్చిన ఆరు నెలల్లోనే గాడ్సే  వార‌సులు గాంధీజీపై  తుటా పేల్చి ఆయ‌న‌ను హ‌త్య చేశారని చెప్పారు. బ్రిటిష‌ర్ల కంటే బీజేపీ నాయ‌కులు ప్ర‌మాద‌కారులని, బ్రిటిష‌ర్ల‌ను దేశం నుంచి త‌రిమికొట్టిన‌ట్లే రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో మ‌నమంతా బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మోదీకి వ్య‌తిరేకంగా పోరాడేందుకు మ‌న‌మంతా సిద్దంగా ఉండాలని, తెలంగాణ‌లో బీజేపీని అడ్డుకునేందుకు, ఓడించేందుకు మేం ఇక్క‌డి నుంచి ఆశ‌ను, ఆదేశాన్ని తీసుకొని వెళుతున్నామని తెలిపారు.  రానున్న రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్య‌తను ప్ర‌తి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌, గాంధీ వార‌సులు ఇక్క‌డి నుంచి తీసుకొని వెళ్లాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.