calender_icon.png 12 January, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ అందిరికంటే ముందే అమలు చేస్తాం: సీఎం రేవంత్

01-08-2024 02:05:46 PM

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ కోసం 27 ఏళ్లుగా పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం సాగించారని సీఎం వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం, తనను, సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్తామని చెప్పిందన్నారు. కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకుపోకుండా మోసం చేసిందని ఆరోపించారు. 2023 డిసెంబర్ 23న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారని తెలిపారు. సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది. దీంతో సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దేశంలో అందరికంటే ముందే ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడిచ్చిన నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడిచ్చిన నోటిఫికేషన్లలో ఆర్డినెన్స్ తీసుకువచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాలని సీఎం రేవంత్ సభను కోరారు.