హనుమకొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ విజయోత్సవాలలో భాగంగా హనుమకొండలో తొలి బహిరంగ సభను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఆడబిడ్డలను కోటీశ్వర్లుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కంకణం కట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరామ్మ రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకునే మమ్మల్ని దీవించి పదవులు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
గత ప్రభుత్వంలో కొన్నేళ్లపాటు మహిళ నేతలను మంత్రివర్గంలోకి తీసుకోలేదని, కానీ కోటి మంది మహిళలను లక్షాదికారులుగా మార్చేందుకు కార్యాచరణ చేపట్టామని వెల్లడించారు. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ కి పదేళ్లపాటు మనసొప్పలేదని విమర్శించారు. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తం చేయటంలో కాళోజీ పాత్ర ఎంతో ఉందని, అయితే ఎంతో పట్టుదలతో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేశామని ముఖ్యమత్రి వ్యాఖ్యానించారు.