calender_icon.png 26 February, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదు?

26-02-2025 04:20:05 PM

హైదరాబాద్: కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పేర్కొన్నారు. కేసు వాదించిన సంజీవరెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారని తెలిపారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్‌లో అనుమానాస్పదంగా చనిపోయారని చెప్పిన ముఖ్యమంత్రి ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు(Radisson Blu drug case)లో కేదార్ కీలక నిందితుడని తెలిపారు. ఈ అనుమానాస్పద మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించట్లేదన్నారు. అనుమానాస్పద మరణాలపై జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరట్లేదు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల అక్రమాలపై ప్రస్తుతం ఏమీ మాట్లాడనని చెప్పారు. సీఎం రేవంత్ ప్రాజెక్టులపై సాంకేతిక నివేదికలు రాకుండా ఏమీ మాట్లాడనన్నారు.