calender_icon.png 28 September, 2024 | 3:04 AM

వీరనారికి సీఎం రేవంత్ నివాళులు

26-09-2024 12:31:12 PM

హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆ వీరనారికి  నివాళులు అర్పించారు. గడీలపై గళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని స్మరించుకున్నారు. మహిళా లోకానికి స్పూర్తిగా నిలుస్తున్న వీరనారి ఐలమ్మ పేరును కోఠీలోని మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ యోధురాలి వారసులకు సముచిత గుర్తింపును కల్పించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.