మెదక్: మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెదక్ చర్చిలో శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. చర్చి ప్రాంగణంలో రూ. 30 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.