హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): హైదరాబాద్ కూకట్‌పల్లి లోని జేఎన్టీయూను శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా వర్సిటీలో నిర్మించిన గోల్డెన్ జూబ్లీ భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆడిటోరియంలో అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలతో సీఎం సమావేశం కానున్నారు. ‘క్వాలిటీ ఆఫ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిథులు కూడా హాజరుకానున్న ట్టు సమాచారం.