ఘనంగా వీడ్కోలు పలికిన రాజ్‌భవన్ సిబ్బంది
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాజాగా రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమి స్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో అక్కడ బాధ్యతలు స్వీకరించనున్నా రు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో నిర్వహిం చిన వీడ్కోలు సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారి వెంకటేశం పాల్గొన్నారు.