హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వేములవాడకు బయల్దేరారు. రాజన్న ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ సమీపంలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 127.65 కోట్లతో పలు అభివృద్ధి పనులకు చేపడుతోంది. అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొనమన్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నారు. రేవంత్ రెడ్డి నేతన్నల కోసం రూ. 50 కోట్లతో నూలు బ్యాంకు ప్రారంభించనున్నారు.