02-04-2025 01:05:12 AM
హాజరుకానున్న పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు
బీసీ సంఘాల ధర్నాకు సంపూర్ణ మద్దతు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ సంఘాలు బుధవారం చేపట్టే ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా.. ఆ పార్టీనేతలు హాజరయ్యేందుకు మంగళవారం ఢిల్లీకి తరలివెళ్లారు.
సీఎం రే వంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు కొండా సు రేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మకన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రకాశ్‌గౌడ్ తది తరులు ఢిల్లీకి వెళ్లారు. అనంతరం కేంద్రమంత్రులు, జాతీయ నేతలను కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి మద్దతు ఇ వ్వాలని కోరనున్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ దూరం..?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలనే డిమాండ్‌తో బుధవా రం ఢిల్లీలో బీసీ సంఘాలు నిర్వహిం చే ధర్నాకు కాంగ్రెస్ హాజరవుతుండగా, బీఆర్‌ఎస్, బీజేపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీసీ సంఘాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలను కలిసి ధర్నాకు హాజరై మద్దతివ్వాలని కో రారు. అయినా రెండు పార్టీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.