calender_icon.png 16 January, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల దాడిలో బాలుడి మృతిపై సీఎం ఆవేదన.. కీలక ఆదేశాలు జారీ

17-07-2024 11:53:29 AM

హైదరాబాద్: సికింద్రాబాద్ జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి మృతి తనను కలిచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల దాడిపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కుక్కలు దాడి చేస్తే అన్ని ఆస్పత్రుల్లో తక్షణం వైద్యం అందించాలని సీఎం తెలిపారు. కుక్కల నియంత్రణలో ఇతర రాష్ట్రాల పద్ధతులను పరిశీలించాలన్నారు.