calender_icon.png 29 September, 2024 | 1:05 PM

సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: హరీశ్ రావు

29-09-2024 10:52:18 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. రూ. 1500 కోట్లతో మూసీ సుందరీకరణ డీపీఆర్ చేస్తున్నారని విమర్శించారు. రూ. 150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేరా? అని ప్రశ్నించారు. 7 నెలల నుంచి మధ్యాహ్న భోజన బిల్లు రావట్లేదన్నారు. బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మూసీలో మురికి నీరు రాకుడా చూడాలి సూచించారు. కాళేశ్వరం కూలిపోయింది అంటూనే గోదావరి నీళ్లు తెస్తానంటున్నావు.. గోదావరి నీళ్లు కాళేశ్వరం నుంచి కాక మరెక్కడి నుంచి తెస్తారో చెప్పాలి? అని ప్రశ్నించారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం పర్యటిస్తోంది. హైదర్ కోట వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పర్యటించింది. హరీష్ రావు, సబిత ఆధ్వర్యంలో మూసి బాధితుల ఇళ్లను నేతలు పరిశీలించనున్నారు.