06-04-2025 10:56:07 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట నుంచి హెలికాప్టర్ లో భద్రాచలం బయలుదేరారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి భద్రాద్రి సీతారామచంద్ర స్వామికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. సకల జగతికి ఆనందకరమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కల్యాణం సందర్భంగా ఆ భద్రాద్రీశుడి ఆశీస్సులు, కరుణాకటాక్షాలు ప్రజలందరిపైనా ఉండాలని ప్రార్థించారు.