calender_icon.png 24 October, 2024 | 3:51 PM

తెలంగాణలో 'డ్రగ్ సోల్జర్స్'.. మత్తు వదిలించనున్న సర్కార్

24-10-2024 01:24:34 PM

హైదరాబాద్‌: తెలంగాణలో డ్రగ్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ పై సరికొత్త తరహా యుద్దాన్ని ప్రకటించారు. డ్రగ్స్ మహమ్మారిని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ప్రభుత్వ ఉద్యోగులను డ్రగ్ సోల్జర్లుగా నియమించింది. ఈ సైనికులు పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. డ్రగ్స్‌ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పారామెడికల్‌ సిబ్బంది, వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ ఉద్యోగులతో కూడిన కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. 'డ్రగ్ సోల్జర్స్' తమ కమ్యూనిటీల్లో డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలను సమర్థవంతంగా గుర్తించి నిరోధించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది సర్కార్.