14-03-2025 12:47:21 PM
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): మాజీ ప్రభుత్వ విప్, మాజీ శాసనసభ్యులు, గంప గోవర్ధన్(Gampa Govardhan) ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డిలో బిఆర్ఎస్(Bharat Rashtra Samithi) పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తా లో సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింద అని పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి(Jukanti Prabhakar Reddy) అన్నారు. శాసనసభ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజా స్వామికమనీ అన్నారు.
స్పష్టమైన కారణం లేకుండా జగదీశ్ రెడ్డిపై వేటు హేయమైన చర్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యను ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మాజీ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, టిఆర్ఎస్ యూత్ విభాగమ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్ట గోని గోపి గౌడ్, బాలరాజ్, గెరిగంటి లక్ష్మీ నారాయణ, మల్లేష్ యాదవ్, నరేష్ రెడ్డి,గిరిని వెంకటి,రాజు, బాజా లలిత, లతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.