calender_icon.png 4 March, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి

03-03-2025 12:59:14 AM

  1. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ 
  2. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై విజ్ఞప్తులు 

హైదరాబాద్, మార్చి2 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సో మవారం ఢిల్లీలో పర్యటించనున్నా రు. కేంద్రం నుంచి తెలంగాణకు రా వాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పలువురు కేంద్ర మంత్రులతో చర్చించ నున్నారు. ప్రతిష్ఠాత్మకంగా కులగణన సర్వే చేపట్టిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కీలకంగా మారాయి.

బీసీ రిజర్వేషన్ల బిల్లును బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోద ము ద్ర వేయాలని, ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు పావులు కదుపుతున్నది. ఈ క్రమంలో మార్చ్ 10న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలిపేలా ప్రధాని మోదీని, పలువురు కేంద్ర మంత్రులను, ఇతర పార్టీల నేతలను సీఎం, డిప్యూటీ సీఎం కోరనున్నారు.

సదరు బిల్లు లెక్క తేల్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న తరుణంలో వీరిద్దరి ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది.