మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయకాంత్రి): వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని మాజీ డిప్యూటీ సీఎం రాజ య్య ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ముందే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని గొప్పలు చెప్పారని మండిపడ్డారు.
మంగళవారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవి, గువ్వల బాలరాజుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడు తూ తాను సీఎం కావడానికి మాదిగలే కారణమని రేవంత్‌రెడ్డి పలు మార్లు చెప్పారని గుర్తు చేశారు. మూడు ఎంపీ స్థానాల్లో రెండు మాలలు, ఒకటి బైండ్లకు ఇచ్చారని, మంత్రి పదవుల్లో ఒకటి మాల, మరొకటి మోచీకి ఇవ్వడం ఇదెక్కడి సామాజిక న్యాయమో అర్ధం కావ డం లేదన్నారు.
తనకు తొలి డిప్యూటీ సీఎంగా పనిచేసే అవకాశం కేసీఆర్ ఇచ్చారని, ఎస్సీ వర్గీకరణపై తనతో అసెంబ్లీలో తీర్మానం పెట్టించారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో వెంటనే అమలు చేయాలని, ఉప సంఘం పేరుతో కాలయాపన చేయడం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాలలకు అనుకూలంగా వ్యవహరిస్తోం దన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్ర సంగిస్తూ ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరి అనుమానంగా ఉందన్నారు.