హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజారిత్విక్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినం దించారు. ‘ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో 7 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచిన రాజారిత్విక్ మన ప్లేయర్ కావడం ఆనందంగా ఉంది’ అని రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గ్రాండ్‌మాస్టర్ రాజారిత్విక్.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత మంచిపేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.