01-04-2025 06:30:27 PM
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి...
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): పేద ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుంది కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కాటేపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను అందజేశారు. అనంతరం నలుగురికి కళ్యాణ లక్ష్మి, చెక్కులు కమ్మరి నాగమణి హన్మండ్లు , బుగ్గుడాల కాశవ్వ పరువయ్య, మంగలి లలిత కృష్ణ, బందీగి అంజవ్వ తుకారం, లకు చెక్కులను అందజేశారు. కాటేపల్లి తండాకు చెందిన రాంసింగ్ కు 60వేల రూపాయలు ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద వాడైన రాంసింగ్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలై లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చు చేసుకున్నాడని తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావ్ కు వివరించగా సిఎం ఆర్ ఎఫ్ నుండి 60వేల రూపాయలు మంజూరు చేయించాడని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ గంగాగౌడ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లప్ప పటేల్,శ్యామప్ప పటేల్,చిప్ప మోహన్, అహ్మద్, మొగుళా గౌడ్, బస్వరాజ్ దేశాయ్, నాగరాజ్,ఇస్మాయిల్ పటేల్,రియాజ్ పటేల్, హాజీ పటేల్, యూసఫ్ పటేల్, చౌటకూరి శంకర్,రాంచందర్,హన్మాండ్లు, రాంచందర్, రవి,అశోక్, బాల్ రాజ్, పాండు నాయక్,బార్థ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.