19-04-2025 07:32:26 PM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు..
బూర్గంపాడు (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఒక వరం లాంటిదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) అన్నారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బూర్గంపాడు మండలానికి చెందిన 34 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు యూత్ నాయకులు భజన ప్రసాద్, మణుగూరు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, శివ తదితరులు పాల్గొన్నారు.