calender_icon.png 21 April, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ఒక వరం లాంటిది

09-04-2025 06:31:45 PM

చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

చేగుంట (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో మెరుగైన శాస్త్ర చికిత్సలు చేయించుకొనే ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేగుంట మండలం చిన్న శివనూర్ గ్రామానికి చెందిన కొఠారి అరవింద్ కు ప్రభుత్వ సహకారం కోసం అప్లై చేసుకున్న తనకి ప్రభుత్వం రూ. 60 రూపాయల సీఎం సహాయనిధి ద్వారా మంజూరయ్యిందని ఆయన తెలిపారు. మంజూరైన చెక్కును బుధవారం లబ్ధిదారునికి అందజేశారు. 

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, రెడ్డిపల్లి ఫ్యాక్స్ చైర్మన్ మేకల పరమేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ మొజామిల్, కొండి శ్రీనివాస్, నియోజకవర్గం యువజన అధ్యక్షులు సయ్యద్ ఉస్సమొద్దీన్, ఉపాధ్యక్షులు బొల్లా ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాషాబోయిన భాస్కర్, సాయికుమార్ గౌడ్, యూత్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, అయిత పరంజ్యోతి, కన్యారం సతీష్, గ్రామ అధ్యక్షుడు నరసింహ చేన్నసేన, నాగరాజు, బలరాం, శ్రీనివాస్, నదీమ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.