calender_icon.png 18 March, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ..

17-03-2025 06:36:55 PM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న వారికి కొండంత అండ సిఎంఆర్ఎఫ్ పథకం అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం  ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ 19 మంది లబ్ధిదారులకు 7,20,000 విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని అన్నారు.

నియోజకవర్గంలో ఇప్పటికే వేలాది కుటుంబాలను సీఎం సహాయనిధి ద్వారా ఆదుకున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ, డివిజన్ అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, బల్ల శ్రీనివాస్ రెడ్డి, వల్లాల శ్యామ్ యాదవ్, కొండా శ్రీధర్ రెడ్డి, మీడియా ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, సాయి కృష్ణ, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముఠా నరేష్, రాజేష్, కరీక కిరణ్, శ్రీధర్ చారి, రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.