calender_icon.png 16 April, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిది పేదలకు భరోసా

16-04-2025 01:28:52 PM

దౌల్తాబాద్, (విజయక్రాంతి): సీఎం సహాయనిది(CM relief fund ) పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన గడ్డమీది లతకు రూ. 33వేలు, ఉప్పరపల్లి పరుశురాములు రూ,10,500, దీపాయంపల్లి యాదవ రెడ్డి రూ.23,500, చిక్కుడు బాలరాజు రూ.55,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి నర్సింలు, కురుమ గణేష్, స్వామి, సత్తయ్య, భీమ్ రెడ్డి, ప్రకాష్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు....