ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్...
మేడిపల్లి (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయనిధి చెక్కులను మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ మేయర్ అజయ్ యాదవ్ లబ్ధిదారులకు అందజేశారు. మేడ్చల్ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయం ఎంతో సహాయపడుతుందని అన్నారు. ఈ సేవలను పేదవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
లబ్ధిదారుల వివరాలు:
1. బొల్లంపల్లి కిషోర్ కుమార్ రూ.47,500
2. యాదగిరి రూ.60,000
3. నాగమణి తిమ్మాపూర్ రూ.60,000
4. నరహరి రూ.57,500
5. గుండా బాలేష్ లాల్ గాడి రూ.60,000
6. సహదేవ్ గుండ్ల రూ.60,000
7. పుణ్యవతి గుండ్ల రూ.30,500
8. జగదీశ్వర్ జగన్ రూ.39,000
9 ఏ. మల్లారెడ్డి అన్నోజిగూడ రూ.60,000
10. జోష్ణ రూ.1,20,000
11. మేకల వెంకటేష్ రూ.60,000
12. గాంధీ రూ.50,000
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పొన్నం తరుణ్ గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి, మేడ్చల్ మండల అధ్యక్షులు రమణ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్, పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగారం మున్సిపాలిటీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.